19న థియేటర్లలో ‘మిస్సింగ్’ గ్రాండ్ రిలీజ్
- పూర్తిగా కొత్తవారు కలిసి తెరకెక్కించిన చిత్రం ‘మిస్సింగ్’
- వల్గారిటీకి తావు లేదన్న చిత్ర బృందం
- థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఓటీటీ ఆఫర్‌ను వదులుకున్నామన్న చిత్ర యూనిట్
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘మిస్సింగ్’. భజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరిరావు ఈ సినిమాను నిర్మించారు. శ్రీని జోస్యుల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్సింగ్’ చిత్రం ఈనెల 19న థియేటర్లలో విడుదలకు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా నటి నికీషా రంగ్వాలా మాట్లాడుతూ... ఈ సినిమాలో మిస్సింగ్ అయ్యేది తానేనని, ఈ నెల 19న ప్రేక్షకులు తనను వెతుకుతారనే అనుకుంటున్నానని పేర్కొన్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తోపాటు తన క్యారెక్టర్ ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసమే సినిమాను తెరకెక్కించామని, అందుకనే ఎన్ని ఆఫర్లు వచ్చినా ఓటీటీలో విడుదలకు మొగ్గు చూపలేదని నటుడు హర్షా నర్రా అన్నారు. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని అన్నారు. ఈ సినిమాను థియేటర్‌లో చూస్తే ఆ అనుభవం వేరుగా ఉంటుందన్నారు. ఇది పూర్తి ఫ్యామిలీ సినిమా అని పేర్కొన్నారు.
కొత్తవాళ్లందరం కలిసి చేసిన సినిమా ఇదని, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని దర్శకుడు శ్రీని జోస్యుల అన్నారు. ఈ సినిమాలో వల్గారిటీకి ఎక్కడా చోటులేదన్నారు. సినిమా నచ్చితే పదిమందికీ చెప్పాలని, లేకుంటే తమతో చెబితే లోపాలు సరిచేసుకుంటామని అన్నారు.
సూర్య, ఛత్రపతి శేఖర్, రామ్‌దత్, విష్ణు విహారి, అశోక్ వర్ధన్, వినోద్ నువ్వుల తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు వశిష్ఠ శర్మ, కిట్టు విస్సాప్రగడ, శ్రీని జోస్యుల సాహిత్యం అందించగా, భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు నర్రా నిర్మించారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం శ్రీని జోస్యుల.