చెన్నైలో భారీ వర్షాల కారణంగా చలిజ్వరం.. ప్రముఖ రచయిత్రి వాణీమోహన్ కన్నుమూత

  • చలి జ్వరం కారణంగా రక్తంలో పడిపోయిన చక్కెర స్థాయులు
  • అమెరికా నుంచి నేడు చెన్నై చేరుకోనున్న వాణీమోహన్ కుమారుడు
  • రేపు అంత్యక్రియలు
చెన్నైలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చలి జ్వరం బారినపడి ప్రముఖ రచయిత్రి వాణీమోహన్ కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. జ్వరం కారణంగా రక్తంలో చక్కెరశాతం పడిపోవడంతో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అమెరికాలో ఉన్న ఆమె కుమారుడు నేడు చెన్నై చేరుకుంటారని, రేపు అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు. వాణీమోహన్ భర్త వఠ్యం మోహన్ రైల్వేలో ఉన్నతాధికారిగా ఉండేవారు. ఆయన ఎక్కువగా ఉత్తర భారతదేశంలో పనిచేయడంతో అక్కడి ప్రత్యేకతలు, వింతలు, విశేషాలను భర్తతో కలిసి గ్రంథస్తం చేశారు.

చెన్నైలో స్థిరపడిన తర్వాత ప్రముఖ రచయిత్రి మాలతీచందూర్ స్ఫూర్తితో రచయితగా ఎదిగి పలు కవితలు, కథలు రాశారు. దేశవిదేశాల్లోని రచయిత్రులతో కలిసి కథల పుస్తకాలు, గొలుసు నవలతోపాటు ‘చిగురులు’ అనే నవలను కూడా రాశారు. ఆకాశవాణి చెన్నై కేంద్రంలో కొన్ని సంవత్సరాలపాటు వివిధ అంశాలపై వాణీమోహన్ ప్రసంగాలు చేశారు.


More Telugu News