హిందుత్వం, హిందూయిజం వేరన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

  • మతపరమైన హింసను ప్రోత్సహించేందుకు రాహుల్ పథకం
  • కాంగ్రెస్ పాలనలో దేశం పాక్షిక ముస్లిం దేశంగా ఉంది
  • షరియా నిబంధనలను చట్టంలో భాగం చేసింది
హిందుత్వం, హిందూయిజం వేర్వేరన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. దేశంలో మతపరమైన హింసను ప్రేరేపించేందుకు రాహుల్ ఒక పథకం ప్రకారం ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో భారత్ పాక్షికంగా ముస్లిం దేశంగా ఉందని, వారి పాలనలో షరియా చట్టాలు అమలయ్యాయని బీజేపీ విమర్శించింది.

త్రిపురలో మసీదులు కూల్చి వేస్తున్నారంటూ అబద్ధపు ప్రచారం చేసి మహారాష్ట్రలో మతకలహాలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పులను బేఖాతరు చేసి మరీ న్యాయవ్యవస్థలో షరియా నిబంధనలను భాగం చేసిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టం నుంచి ఆ నిబంధనలను తొలగించిందన్నారు.


More Telugu News