దేశ స్వాతంత్ర్యంపై వ్యాఖ్యల ఫలితం.. బాలీవుడ్ నటి కంగనపై హైదరాబాద్‌లో కేసు నమోదు
- 1947లో దేశానికి వచ్చింది అసలైన స్వాతంత్ర్యం కాదన్న కంగన
- ఇలాంటి పిచ్చి కూతలు మానుకోవాలన్న సుదర్శన్
- అరెస్ట్ చేయడంతోపాటు, పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని డిమాండ్
1947లో దేశానికి వచ్చిన స్వాతంత్ర్యం అసలైనది కాదని, దేశానికి మోదీ ప్రధాని అయ్యాక వచ్చినదే అసలైన స్వాతంత్ర్యమంటూ బాలీవుడ్ వివాదాస్పద నటి కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. దేశ స్వాతంత్ర్యాన్ని అవమానించేలా మాట్లాడారంటూ శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయురాలు అయి ఉండీ కంగన ఇలా మాట్లాడడం సరికాదని, ఇలాంటి పిచ్చికూతలు మానుకోవాలని హెచ్చరించారు. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని, ఇటీవల ఆమెకు ప్రదానం చేసిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుదర్శన్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, కంగన చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది.