ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ
- హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అసంతృప్తి
- అభ్యర్థిని 3 నెలల ముందే ప్రకటించాల్సిందన్న జగ్గారెడ్డి
- ఆలస్యం కావడం వల్లే నష్టం జరిగిందని వెల్లడి
- సమీక్షకు తనను పిలవలేదని ఆరోపణ
కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు లేఖ రాశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక, తదనంతర పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్ బాల్మూరిని 3 నెలల ముందే ప్రకటించాల్సిందని అభిప్రాయపడ్డారు. అభ్యర్థిని ఎంతో ఆలస్యంగా ప్రకటించడం వల్లే తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా బీజేపీకి వెళ్లిపోయిందని జగ్గారెడ్డి వివరించారు.
ఇక, హుజూరాబాద్ ఉప ఎన్నిక సమీక్షకు తనను ఆహ్వానించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్చార్జిగా ఉన్న తనను పిలవకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
ఇక, హుజూరాబాద్ ఉప ఎన్నిక సమీక్షకు తనను ఆహ్వానించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్చార్జిగా ఉన్న తనను పిలవకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.