ఆ గున్న ఏనుగు పేరు ఇకపై ‘పునీత్ రాజ్‌కుమార్!’
- మరణానికి కొన్ని రోజుల ముందు సక్రెబైలు ఏనుగు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన పునీత్
- రెండేళ్ల వయసున్న ఏనుగు పిల్లతో కాలక్షేపం
- స్థానికులు, సిబ్బంది కోరిక మేరకు పునీత్ రాజ్‌కుమార్ పేరు
కర్ణాటక శివమొగ్గ సమీపంలోని సక్రెబైలు ఏనుగు శిక్షణ కేంద్రంలోని ఓ గున్న ఏనుగుకు ఇటీవల హఠాన్మరణం చెందిన ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టారు. రెండేళ్ల వయసున్న ఈ ఏనుగు అంటే పునీత్‌కు ఎంతో ఇష్టమని అధికారులు తెలిపారు. మరణానికి కొన్ని రోజుల క్రితం ఈ క్యాంపును సందర్శించిన పునీత్ రాజ్‌కుమార్ మూడు గంటలపాటు అక్కడే గడిపారు. మరీ ముఖ్యంగా ఈ గున్న ఏనుగుపై విపరీతమైన వాత్సల్యం చూపించిన పునీత్ ఎక్కువ సమయం దానితోనే కాలక్షేపం చేశారు.
ఏనుగు పిల్లకు నటుడి పేరు పెట్టడంపై ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ నాగరాజ్ మాట్లాడుతూ.. తాము సాధారణంగా దేవుళ్ల పేర్లే పెడతామన్నారు. కానీ, ఈసారి స్థానికులు, సిబ్బంది కోరిక మేరకు పునీత్‌కు ఎంతో ఇష్టమైన ఈ ఏనుగు పిల్లకు ఆయన పేరుపై నామకరణం చేసినట్టు చెప్పారు. ఆయన పేరు పెట్టినందుకు తమకెంతో సంతోషంగా ఉందన్నారు.
పునీత్ రాజ్‌కుమార్ సెప్టెంబరులో సక్రెబైలు ఏనుగు శిక్షణాకేంద్రాన్ని చివరిసారి సందర్శించారు. అంతకుముందు ఈ ఏడాది మొదట్లో ఏనుగుల సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం ఒకసారి ఈ కేంద్రాన్ని పునీత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఈ గున్న ఏనుగుతో కొంతసేపు గడిపారు.
ఈ గున్న ఏనుగు తల్లి పేరు నేత్ర. సాధారణంగా ఏనుగు పిల్లకు రెండేళ్లు రాగానే తల్లి నుంచి దానిని వేరు చేస్తారు. అయితే, వర్షాల కారణంగా ఈ ప్రక్రియ మూడు నెలలు వాయిదా పడింది. రెండేళ్ల వయసులో తల్లి నుంచి పిల్లను వేరు చేయకపోతే ఆ తర్వాత దానిని నియంత్రించడం కష్టమవుతుందని నాగరాజ్ తెలిపారు.