15న భోపాల్‌లో పర్యటించనున్న మోదీ.. 4 గంటల కోసం రూ. 23 కోట్ల ఖర్చు!

  • ఎల్లుండి భోపాల్‌లో పర్యటించనున్న మోదీ
  • భగవాన్ బిర్సాముండా జ్ఞాపకార్థం నిర్వహించే జన్ జాతీయ గౌరవ్ దివస్‌లో మోదీ
  • గిరిజనులను సభకు తరలించేందుకు రూ. 13 కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
భారత ప్రధాని నరేంద్రమోదీ ఎల్లుండి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పర్యటించనున్నారు. భగవాన్ బిర్సాముండా జ్ఞాపకార్థం జంబూరి మైదాన్‌లో నిర్వహించే జన్ జాతీయ గౌరవ్ దివస్‌లో మోదీ పాల్గొంటారు. మోదీ నాలుగు గంటలు మాత్రమే భోపాల్‌లో గడుపుతారు. ప్రధాని పర్యటన కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా రూ. 23 కోట్లకు పైగా ఖర్చు చేస్తుండడం గమనార్హం.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజనులను ఈ సభకు తరలించేందుకే ప్రభుత్వం రూ. 13 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, ఇదే పర్యటనలో హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌ను మోదీ జాతికి అంకితం చేస్తారు. ఈ స్టేషన్‌కో ప్రత్యేకత ఉంది. ఈ స్టేషన్‌ను ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించారు. ఇలా నిర్మించిన తొలి అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్ ఇదే. కాగా, ఇటీవల ప్రభుత్వం కొన్ని ప్రైవేటు రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రూట్లు కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే.


More Telugu News