ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నోటీసులకు దిగొచ్చిన ర్యాపిడో
- ఆర్టీసీ బస్సులను కించపరిచేలా ర్యాపిడో వాణిజ్య ప్రకటన
- సాధారణ దోసెల్లా చాలా సమయం తీసుకుంటాయని పోలిక
- ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని యాడ్
- యాడ్‌ను వెనక్కి తీసుకున్న సంస్థ
సినీ నటుడు అల్లు అర్జున్‌తో చిత్రీకరించిన ర్యాపిడో వాణిజ్య ప్రకటన తెలంగాణ ఆర్టీసీ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందన్న విమర్శలపై బైక్ రైడింగ్ యాప్ ర్యాపిడో స్పందించింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లీగల్ నోటీసులకు స్పందించిన ర్యాపిడో.. టీఎస్ ఆర్టీసీ బస్సులను చూపిస్తూ చిత్రీకరించిన సన్నివేశాలను తొలగించింది.
ర్యాపిడో చిత్రీకరించిన ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల్లా చాలా సమయం తీసుకుంటాయని, ర్యాపిడో మాత్రం చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని అర్జున్ ఆ ప్రకటనలో చెప్పడం కనిపిస్తుంది.
ఈ ప్రకటనపై ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ ప్రకటనలో నటించిన అల్లు అర్జున్‌తోపాటు ర్యాపిడో సంస్థకు నోటీసులు పంపారు. నోటీసులతో వెనక్కి తగ్గిన ర్యాపిడో ఆ సన్నివేశాలను తొలగించింది.