అంతర్జాతీయ సదస్సుకు సీఎం జగన్ ను ఆహ్వానించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం
- భారత్ లో పర్యటిస్తున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు
- ఫోరం అధ్యక్షుడితో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ
- సీఎం జగన్ పరిపాలన తీరును వివరించిన మంత్రి
- వచ్చే ఏడాది జనవరిలో దావోస్ లో సదస్సు
వచ్చే ఏడాది జనవరిలో దావోస్ లో 'వర్కింగ్ టుగెదర్... రీస్టోరింగ్ ట్రస్ట్' అనే కాన్సెప్టుతో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఏపీ సీఎం జగన్ ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్జ్ బ్రెండేని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా సదస్సు వివరాలను బ్రెండే మంత్రికి తెలిపారు.
బ్రెండేకు గౌతమ్ రెడ్డి ఏపీ సీఎం జగన్ పరిపాలన తీరును వివరించారు. కరోనా సంక్షోభ సమయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక విధానం తదితర అంశాలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండే ప్రత్యేకంగా ప్రశంసించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు 2022 జనవరి 17, 22 తేదీల మధ్య జరగనుంది.