ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన సజ్జల
- ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్
- డిసెంబరు 10న పోలింగ్
- అభ్యర్థులను ఎంపిక చేసిన వైసీపీ అధినాయకత్వం
- వెనుకబడిన వర్గాలకు అత్యధిక స్థానాలు
ఏపీలో ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం తెలిసిందే. డిసెంబరు 10న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తమ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 11 స్థానాల్లో అత్యధికం వెనుకబడిన వర్గాలకు కేటాయించినట్టు తెలుస్తోంది.
- ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు- కాపు)
- తలశిల రఘురాం (కృష్ణా జిల్లా- కమ్మ సామాజిక వర్గం)
- మురుగుడు హనుమంతరావు (గుంటూరు- చేనేత)
- వై.శివరామిరెడ్డి (అనంతపురం- రెడ్డి సామాజిక వర్గం)
- అనంత ఉదయభాస్కర్ (తూర్పు గోదావరి- కాపు)
- ఇందుకూరు రఘురాజ్ (విజయనగరం- క్షత్రియ)
- వరుదు కల్యాణి (విశాఖ- బీసీ- వెలమ)
- వంశీకృష్ణ యాదవ్ (విశాఖ- యాదవ)
- మొండితోక అరుణ్ కుమార్ (కృష్ణా- ఎస్సీ సామాజిక వర్గం)
- కేఆర్ జే భరత్ (చిత్తూరు- బీసీ. వన్యకుల క్షత్రియ)
- తూమాటి మాధవరావు (ప్రకాశం- కమ్మ సామాజిక వర్గం)