విహారికి హడావుడిగా ఇండియా-ఏ జట్టులో స్థానం కల్పించిన బీసీసీఐ

  • న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు టీమిండియా ఎంపిక
  • విహారికి దక్కని చోటు
  • బీసీసీఐపై తీవ్ర విమర్శలు
  • బోర్డు కంటితుడుపు చర్య!
  • మరోసారి నెటిజన్ల విమర్శలు
తెలుగు ఆటగాడు హనుమ విహారిని న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు ఎంపిక చేయకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వస్తుండడంతో బీసీసీఐ స్పందించినట్టే కనిపిస్తోంది. విహారికి హడావుడిగా ఇండియా-ఏ జట్టులో స్థానం కల్పించింది.

వాస్తవానికి న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ఆడే టీమిండియాతో పాటు దక్షిణాఫ్రికాలో పర్యటించే ఇండియా-ఏ జట్టును ఇంతకుముందే ప్రకటించారు. అయితే, టీమిండియాలో విహారిని ఎంపిక చేయకపోవడం పట్ల సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి. అభిమానుల ఆక్రోశం బీసీసీఐ చెవినపడినట్టే కనిపిస్తోంది.

అయితే విహారి వంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని ఇండియా-ఏ జట్టుకు ఎంపిక చేయడం కంటితుడుపు చర్యేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అంతర్జాతీయ అనుభవం ఏమాత్రం లేని ప్రియాంక్ పాంచల్ ను ఇండియా-ఏ జట్టుకు కెప్టెన్ గా నియమించి, విహారి వంటి ప్రతిభావంతుడిని చివరి నిమిషంలో జట్టులో చేర్చడం కూడా విమర్శలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'సిడ్నీ టెస్టులో వీరోచితంగా ఆడినందుకు ఇదా ప్రతిఫలం? విహారి సీనియర్ జట్టులో ఉండాల్సిన ఆటగాడు' అంటూ నెటిజన్లు మళ్లీ స్పందిస్తున్నారు.


More Telugu News