ఆ రెండు పార్టీలకు ఓట్లు వేసినా వేస్టే: ఏపీ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్

  • నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం
  • ప్రతి ఇంటికి పట్టా ఇప్పించే బాధ్యత నాదే
  • జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు కార్పొరేషన్ లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని చెప్పారు. నెల్లూరులోని ఇస్లాంపేట, భగత్ సింగ్ కాలనీల్లో ఒక్క ఇంటిని కూడా తొలగించబోమని తెలిపారు.

తెలుగుదేశం, సీపీఎం పార్టీల నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. ఈ రెండు పార్టీలకు ఓట్లు వేసినా వేస్టేనని చెప్పారు. ప్రతి ఇంటికి పట్టాలు ఇప్పించే బాధ్యత తనదేనని అన్నారు. జగన్ పాలనకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఓటు చాలా విలువైనదని... ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న వైసీపీకి ఓటు వేయాలని కోరారు. 54వ డివిజన్ అభ్యర్థి షఫియా బేగంతో కలిసి అనిల్ యాదవ్ ఈరోజు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.


More Telugu News