ఇకపై ఆటోమేటిక్ గా జాబ్ రీ–ఆథరైజేషన్.. హెచ్4 వీసాలపై అమెరికా గుడ్ న్యూస్

  • అంగీకారం తెలిపిన హోం ల్యాండ్ సెక్యూరిటీస్
  • వేలాది మంది హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు మేలు
  • ట్రంప్ హయాంలో రీ–ఆథరైజేషన్ రద్దు
భారతీయులు సహా వేలాది మంది వలసదారులకు ప్రయోజనం కలిగేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ‘ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్’ను కల్పించేందకు బైడెన్ ప్రభుత్వం ఓకే చెప్పింది. అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (ఏఐఎల్ఏ) వేసిన పిటిషన్ పై హోం ల్యాండ్ సెక్యూరిటీ శాఖ సానుకూల స్పందనను తెలియజేసింది.

హెచ్1బీ వీసాదారుల భాగస్వాములు, వారి 21 ఏళ్ల లోపు పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలుగా హెచ్4 వీసాలను జారీ చేస్తుంటారు. అయితే, జాబ్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ల గడువు పొడిగింపు కోసం తరచూ రెగ్యులేటరీ పరీక్షలను రాయాల్సి వస్తోంది. అయితే, హెచ్4 వీసాలపై ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు మళ్లీ ఉద్యోగాలు పొందకుండా ట్రంప్ హయాంలో హోం ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ ఆంక్షలు విధించింది. దీంతో చాలా మంది రీ–ఆథరైజేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.

దీనిపై హెచ్4 వీసాదారులు ఏఐఎల్ఏని ఆశ్రయించారు. వారు హోంల్యాండ్ విభాగంలో పిటిషన్ ను సమర్పించారు. దీనిపై స్పందించిన హోం ల్యాండ్ డిపార్ట్ మెంట్ అధికారులు.. గడువు సమీపిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఉద్యోగం చేసుకునే హక్కును పునరుద్ధరించేందుకు అంగీకారం తెలిపారు. కాగా, తొలిసారి ఒబామా హయాంలో హెచ్4 వీసాలను జారీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 90 వేల మందికి వీసాలు రాగా.. ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు.


More Telugu News