దేశవిభజనకు కాంగ్రెస్ పార్టీనే కారణం: అసదుద్దీన్ ఒవైసీ

  • వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు
  • సమాజ్ వాదీ పార్టీతో సుహేల్ దేవ్ సమాజ్ వాదీ పార్టీ పొత్తు
  • దేశవిభజనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజ్ భర్
  • స్పందించిన ఒవైసీ
మహ్మద్ అలీ జిన్నా భారత ప్రధాని అయ్యుంటే దేశ విభజన జరిగుండేది కాదని సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓపీ రాజ్ భర్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. దేశ విభజనకు నాటి కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ నేతలు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు.

దేశవిభజన జరిగింది ముస్లింల వల్ల కాదని, కేవలం జిన్నా అంశం వల్లేనని స్పష్టం చేశారు. ఆ సమయంలో ముస్లింలలో సంపన్నులు, విద్యాధికులు మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండేవారని, నాటి కాంగ్రెస్ నేతలే దేశ విభజనకు కారకులని ఒవైసీ వివరించారు.

2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సుహేల్ దేవ్ సమాజ్ వాదీ పార్టీ... సమాజ్ వాదీ పార్టీతో కలిసి బరిలో దిగుతోంది. సుహేల్ దేవ్ సమాజ్ వాదీ పార్టీ అధినేత ఓపీ రాజ్ భర్ బుధవారం వారణాసిలో మాట్లాడుతూ, చారిత్రాత్మక దేశవిభజన ఘట్టానికి ఆర్ఎస్ఎస్సే కారణమని ఆరోపించారు.


More Telugu News