టీ20 వరల్డ్ కప్: పాకిస్థాన్ తో సెమీస్ లో టాస్ నెగ్గిన ఆసీస్
- టీ20 వరల్డ్ కప్ లో నేడు రెండో సెమీస్
- దుబాయ్ వేదికగా సమరం
- టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
- ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగుతున్న ఇరు జట్లు
టీ20 వరల్డ్ కప్ లో నేడు రెండో సెమీఫైనల్ జరుగుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్థాన్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా జట్టులో ఈ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు లేవు. కాగా, కీలక ఆటగాళ్లు షోయబ్ మాలిక్, మహ్మద్ రిజ్వాన్ గాయాలతో దూరమవుతున్నారంటూ వచ్చిన కథనాలు వట్టిదేనని పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ మాటలతో స్పష్టమైంది. తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని, అదే జట్టుతో బరిలో దిగుతున్నామని బాబర్ వివరించాడు.
ఆసీస్ బౌలింగ్ కు, పాక్ బ్యాటింగ్ కు ఈ మ్యాచ్ లో రసవత్తరమైన పోరు తప్పదని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. మిచెల్ స్టార్క్, హేజెల్ వుడ్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపాలతో ఆసీస్ బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తుండగా, బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీలతో పాక్ బ్యాటింగ్ లైనప్ పటిష్ఠంగా ఉంది.