మాతా అన్నపూర్ణా దేవి విగ్రహం వందేళ్ల క్రితం చోరీకి ఎలా గురైందంటే..!

  • 1913లో భారత పర్యటనకు వచ్చినప్పుడు విగ్రహాన్ని చూసిన నోర్మన్ మెకంజీ
  • ఆయన కోరిక మేరకు విగ్రహాన్ని చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తి
  • 2019లో కెనడా మ్యూజియంలో విగ్రహాన్ని గుర్తించిన దివ్య మెహ్రా
దాదాపు వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణా దేవి విగ్రహం తిరిగి భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. 18వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహాన్ని కెనడా నుంచి భారత్ కు రప్పించారు. అసలు ఈ విగ్రహం వివరాలు ఏమిటి? అది చోరీకి ఎలా గురైందనే వివరాలను తెలుసుకుందాం.

కెనడాలోని నోర్మన్ మెకంజీ గ్యాలరీలో దివ్య మెహ్రా అనే ఆర్టిస్టు 2019లో ఈ విగ్రహాన్ని గమనించారు. గ్యాలరీలో తన ఎగ్జిబిషన్ కోసం సిద్ధమవుతూ ఈ విగ్రహాన్ని ఆమె చూశారు. ఆ తర్వాత విగ్రహానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ క్రమంలో వారణాసి విశ్వేశ్వరాలయం నుంచి ఈ విగ్రహాన్ని చోరీ చేసినట్టు ఆమె గుర్తించారు.
 
విగ్రహం చోరీ విషయానికి వస్తే... 1913లో భారత పర్యటనకు మెకంజీ వచ్చినప్పుడు ఈ విగ్రహాన్ని చూశారు. ఆయన కోరిక మేరకు ఒక గుర్తు తెలియని వ్యక్తి విగ్రహాన్ని చోరీ చేసి ఆయనకు ఇచ్చినట్టు రికార్డుల్లో ఉంది. ఈ విషయం తెలియగానే మెకంజీ ఆర్ట్ గ్యాలరీ సీఈవోతో దివ్య మెహ్రా మాట్లాడారు. విగ్రహాన్ని భారత్ కు అప్పగించాలని కోరారు.

 మరోవైపు కెనడా ప్రభుత్వంతో భారత దౌత్య కార్యాలయ అధికారులు కూడా చర్చలు జరిపారు. చివరకు అమ్మవారి విగ్రహాన్ని భారత్ కు కెనడా ప్రభుత్వం అప్పజెప్పింది. సాక్షాత్తు పరమ శివుడికే అన్నపూర్ణా దేవి భిక్ష వేసినట్టు హిందువుల నమ్మకం. ఈమె ఉన్నచోట ఆకలి బాధలు ఉండవని భావిస్తారు.


More Telugu News