ధాన్యం కొనాలంటూ తెలంగాణ అంతటా బీజేపీ ఆందోళనలు
- కలెక్టరేట్ల ముందు పార్టీ శ్రేణుల ధర్నాలు
- పార్టీ కిసాన్ మోర్చా పిలుపుతో నిరసనలు
- కేంద్రాన్ని బదనాం చేస్తున్నారని మండిపాటు
వానాకాలం పంటను ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణలో బీజేపీ నేతలు ధర్నాలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనలను నిర్వహించారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం కొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లకు సరైన ఏర్పాట్లే చేయలేదని మండిపడ్డారు. కేంద్రాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప.. కొనుగోళ్లను మాత్రం చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనేవరకు ఆందోళనలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు.