‘తెలంగాణ దేవుడు’కి ప్రాణం పోశారు: హాస్య నటుడు బ్రహ్మానందం
- శ్రీకాంత్, సంగీతల నటన బాగుంది
- డైరెక్టర్ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తీశారు
- నన్ను ఓ ఉపాధ్యాయుడిగా చూపించారు
- రేపు రిలీజ్ కానున్న సినిమా
'తెలంగాణ దేవుడు' ఓ సందేశాత్మక చిత్రమని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కొనియాడారు. రేపు సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందానికి ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాకు శ్రీకాంత్, సంగీతలు వారి నటనతో ప్రాణం పోశారని బ్రహ్మానందం కొనియాడారు. డైరెక్టర్ హరీశ్ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సినిమాను తెరకెక్కించారని, సమర్థవంతమైన దర్శకుడని ప్రశంసించారు.
తన పాత్ర కూడా సినిమాలో చాలా బాగుంటుందన్నారు. తనను కేవలం కామెడీకే పరిమితం చేయకుండా.. హీరో గురువైన మృత్యుంజయ శర్మ పాత్రను తనకిచ్చారని అన్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందన్నారు. కొంచెం జాప్యం జరిగినా దర్శకుడు సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడని కొనియాడారు. కాగా, ఈ సినిమాను జీషన్ ఉస్మానీ నిర్మించగా.. నందన్ బొబ్బిలి స్వరాలు సమకూర్చారు.