ఎమ్మెల్యే కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!
- అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సజ్జల
- పాలవలస విక్రాంత్, డీసీ గోవిందరెడ్డి, ఇషాక్ బాషాలకు అవకాశం
- డిసెంబర్ 10న జరగనున్న పోలింగ్
ఏపీలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వీటిలో ఎమ్మెల్యే కోటా స్థానాలతో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి నిన్ననే ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. పాలవలస విక్రాంత్ (శ్రీకాకుళం), డీసీ గోవిందరెడ్డి (కడప), ఇషాక్ బాషా (కర్నూలు) పేర్లను ఆయన ప్రకటించారు.
నవంబర్ 16న ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నవంబర్ 23 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 26 చివరి తేదీ. డిసెంబర్ 10న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ ప్రకటించింది.