భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ దంపతులకు మంత్రి హరీశ్ రావు ప్రశంసలు

  • ప్రభుత్వాసుపత్రిలో భార్యకు ప్రసవం చేయించిన అనుదీప్
  • ట్విట్టర్ లో అభినందనలు తెలిపిన హరీశ్
  • సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్య వసతులు మెరుగయ్యాయని కామెంట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దంపతులపై తెలంగాణ ఆర్థికశాఖ, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశంసల జల్లు కురిపించారు. అనుదీప్ తన భార్య మాధవికి ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హరీశ్ ట్విట్టర్ లో వారికి అభినందనలు తెలిపారు.

‘‘భద్రాద్రి కలెక్టర్, ఆయన భార్యకు శుభాకాంక్షలు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వైద్యారోగ్య మౌలిక వసతులు మెరుగయ్యాయనేందుకు ఇదే నిదర్శనం. ప్రజలకు ప్రభుత్వాసుపత్రులే మొదటి చాయిస్ అవుతున్నందుకు చాలా గర్వంగా ఉంది’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.


More Telugu News