నేలవేషాల కార్యక్రమంలో అపశ్రుతి.. నోట్లో డీజిల్ పోసుకుని విన్యాసం.. మంటలు అంటుకుని తీవ్రగాయాలు
- విశాఖ జిల్లా యలమంచిలిలో ఘటన
- నాగుల చవితి సందర్భంగా కార్యక్రమం
- కేజీహెచ్ కు బాధితుడి తరలింపు
విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో నాగుల చవితి సందర్భంగా నిర్వహించిన నేల వేషాల కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సంతోష్ అనే వ్యక్తి నోట్లో డీజిల్ పోసుకుని విన్యాసాలు చేస్తుండగా.. మంటలు అంటుకుని మొహానికి తీవ్రగాయాలయ్యాయి.
అక్కడే ఉన్న స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా.. అప్పటికే సంతోష్ చేతిలోని సీసాలో ఉన్న డీజిల్ పడి మంటలు మరింత తీవ్రమయ్యాయి. మొహం, ఛాతి భాగాలకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే అతడిని విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగడంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు.