‘పుష్పక విమానం’లో తన పాత్రేంటో చెప్పేసిన యంగ్ హీరోయిన్ శాన్వి మేఘన
- షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోయిన నటి
- 12న థియేటర్లలో సినిమా విడుదల
- అచ్చమైన హైదరాబాద్ అమ్మాయి శాన్వి
- సినిమా విశేషాలు పంచుకున్న నటి
‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’, ‘పిట్ట కథలు’, ‘సైరా నరసింహారెడ్డి’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన యంగ్ హీరోయిన్ శాన్వి మేఘన. ఆమె నాయికగా నటిస్తున్న కొత్త సినిమా ‘పుష్పక విమానం’. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంలో షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ క్యారెక్టర్లో మెప్పిస్తానంటోంది శాన్వి.
దామోదర దర్శకత్వంలో 'కింగ్ అఫ్ ది హిల్' ఎంటర్టైన్మెంట్స్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. గోవర్ధన్‌రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ నెల 12న ఇది థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తన కెరియర్‌కు సంబంధించిన విషయాలతోపాటు సినిమా విశేషాలను శాన్వి పంచుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
"నేను హైదరాబాద్ అమ్మాయిని. కాలేజ్‌లో ఉండగా మా క్యాంపస్‌లో కొన్ని సినిమాల షూటింగ్స్ జరుగుతుండేవి. అక్కడ నన్ను చూసి, ఓ సీరియల్ ఆడిషన్ కోసం పిలిచారు. మా ఇంట్లో వాళ్లకు నేను సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. నాకు కూడా నటన అంటే అంత ఇంట్రస్ట్ ఉండేది కాదు. ఒకసారి జయసుధ గారు తన టీవీ ప్రోగ్రాంలో అవకాశం ఇవ్వడం కోసం మా ఇంట్లో వాళ్లతో మాట్లాడారు. అంత పెద్ద నటి పిలిచి అవకాశం ఇస్తుండడంతో అమ్మా నాన్న అభ్యంతరం చెప్పలేదు. జయసుధ గారు ఆ టీవీ ప్రోగ్రాంకి నిర్మాత. కానీ అనుకోని కారణాల రెండు ఎపిసోడ్స్ షూట్ చేసిన తర్వాత ఆ టీవీ కార్యక్రమం ఆగిపోయింది.
ఇంతలో బిలాల్పూర్ ‘పోలీస్ స్టేషన్’ సినిమాలో నాయికగా అవకాశం వచ్చింది. ఆ సినిమా అయ్యాక మెగాస్టార్ చిరంజీవి సినిమా 'సైరా నరసింహారెడ్డి'లో ఓ చిన్న క్యారెక్టర్ రోల్ చేశాను. ఆ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు సురేందర్‌రెడ్డి నన్ను తమన్నా చెల్లిలా ఉంది, ఆడిషన్ వద్దు అన్నారు. ఆ మాట పెద్ద కాంప్లిమెంట్ లా ఫీలయ్యా.
‘సైరా’ తర్వాత తరుణ్ భాస్కర్ గారు నెట్ ఫ్లిక్స్ 'పిట్ట కథలు' వెబ్ సిరీస్ కోసం ఆడిషన్ చేసి తీసుకున్నారు. ఆయనే ‘పుష్పక విమానం’ చిత్రానికి నన్ను రెఫర్ చేశారు. దర్శకుడు దామోదర గారు ఆడిషన్ చేసి సెకండ్ లీడ్‌గా సెలెక్ట్ చేశారు.
పుష్పక విమానం చిత్రంలో షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ క్యారెక్టర్లో కనిపిస్తాను. చాలా బబ్లీ రోల్ ఇది. ఈ క్యారెక్టర్లో మిమ్మల్ని ఆకట్టుకుంటాను. ఈ సినిమాలో హీరో ఆనంద్, గీత్ సైని, నా క్యారెక్టర్ ఎక్కడా రెగ్యులర్ హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్‌లా కనిపించవు. అవి కథలో సహజంగా ప్లే అవుతూ ఉంటాయి.
పుష్పక విమానం ఫస్టాఫ్ చాలా ఫన్‌గా సాగుతుంది. సెకండాఫ్ ఎమోషనల్ గా ఉంటుంది. సినిమాలో ఆనంద్ క్యారెక్టర్‌తో నా రిలేషన్ ఏంటి అనేది తెరపైనే చూడాలి. సినిమాలో సందర్భానుసారం నా క్యారెక్టర్ వస్తుంది. సినిమా చూశాక చాలా సంతృప్తిగా అనిపించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ నా గురించి బాగా చెప్పారు. నా అభినయం బాగుందన్నారు. అక్కడే మా అమ్మా నాన్న కూడా ఉన్నారు. విజయ్ ప్రశంసకు నేనూ, అమ్మా నాన్న హ్యాపీగా ఫీలయ్యాం.
హీరోయిన్గా ఇలాంటి క్యారెక్టర్లే చేయాలని నియమం పెట్టుకోలేదు. నాకు నచ్చితే నటిస్తాను. ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి గారు, హీరో అల్లు అర్జున్. విజయ్ దేవరకొండతో నటించే అవకాశం వస్తే వదులుకుంటామా? పిట్ట కథలు తర్వాత వెబ్‌సిరీస్‌లలో ఆఫర్స్ వచ్చాయి. అప్పటికే పుష్పక విమానం ఒప్పుకుని ఉన్నాను. ఆ సమయంలోనే కరోనా ఉద్ధృతి పెరగడంతో వెబ్ సిరీస్‌లు చేయలేదు. ప్రస్తుతం రెండు మూడు చిత్రాలకు కథలు విన్నాను. ఓకే అయ్యాక వివరాలు చెబుతాను" అని చెప్పింది శాన్వి.