భారత నావికాదళ తదుపరి చీఫ్‌గా వైస్ అడ్మిరల్‌ హరికుమార్.. 30న బాధ్యతల స్వీకరణ

  • ఈ నెల 30తో ముగియనున్న ప్రస్తుత చీఫ్ కరమ్‌బీర్ సింగ్ పదవీ కాలం
  • అదే రోజు ఆయన నుంచి బాధ్యతల స్వీకరణ
  • 39 ఏళ్ల కెరియర్‌లో పలు హోదాల్లో సేవలు
భారత నావికాదళ ప్రస్తుత చీఫ్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ పదవీకాలం ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో కొత్త చీఫ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ నౌకాదళ కమాండ్‌కు ప్లాగ్ ఆఫీసర్‌ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైస్ అడ్మిరల్ ఆర్. హరికుమార్‌ను తదుపరి అధిపతిగా నియమించింది. ఈ మేరకు నిన్న కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరమ్‌బీర్ సింగ్ పదవీ విరమణ చేసిన రోజే హరికుమార్ ఆయన నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.

1983లో భారత నావికాదళంలో చేరిన హరికుమార్ 39 ఏళ్ల కెరియర్‌లో కమాండ్, స్టాఫ్ విభాగాల్లో పలు హోదాల్లో పనిచేశారు. అలాగే, ఐఎన్ఎస్ నిషాంక్, మిసైల్ కార్వెట్, ఐఎన్ఎస్ కొరా, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రణ్‌వీర్‌కు కమాండింగ్ అధికారిగానూ పనిచేశారు. నేవీ ఎయిర్‌క్రాఫ్ట్ ఐఎన్ఎస్ విరాట్‌కు కూడా నాయకత్వం వహించారు.


More Telugu News