మరణానంతరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్... అవార్డు స్వీకరించిన తనయుడు

  • 2020, 21 సంవత్సరాలకు పద్మ పురస్కారాల ప్రదానం 
  • గతేడాది కరోనా ప్రభావంతో కన్నుమూసిన బాలు
  • గతంలో పద్మశ్రీ, పద్మభూషణ్ అందుకున్న గాన గంధర్వుడు
మహోన్నత గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనకు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఇవాళ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా బాలు తనయుడు ఎస్పీ చరణ్ తండ్రి తరఫున పద్మ పురస్కారాన్ని స్వీకరించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ అవార్డును ప్రదానం చేశారు.

2020, 21 సంవత్సరాలకు గాను పద్మ పురస్కారాలను రెండ్రోజులుగా నాలుగు విడతల్లో ప్రదానం చేస్తున్నారు. ఎస్పీ బాలు (74) గతేడాది కరోనా బారినపడి, నెలరోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొంది తుదిశ్వాస విడిచారు. బాలు మృతితో భారతీయ సినీ రంగం తీవ్ర విషాదానికి గురైంది. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన బాలును 2001లో పద్మశ్రీ, 2011లో పద్మ భూషణ్ వరించింది.


More Telugu News