ఆనంద్ దేవరకొండ ఇక రూట్ మార్చాలేమో!
- 'దొరసాని'తో పరిచయం
- 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో గుర్తింపు
- వరుసగా ఇన్నోసెంట్ పాత్రలు
- ఈ నెల 12న రానున్న 'పుష్పక విమానం'
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, సినిమాల పట్ల గల ఆసక్తితో మంచి జాబ్ వదిలేసి ఇటువైపు వచ్చాడు. అప్పటి నుంచి కూడా ఒక్కో సినిమాను చేసుకుంటూ వస్తున్నాడు. 'దొరసాని' సినిమాలో ఆనంద్ దేవరకొండ ఒక అమాయకుడైన పల్లెటూరి ప్రేమికుడిగా కనిపిస్తాడు. ఆ పాత్రకు ఆయన బాడీ లాంగ్వేజ్ సరిపోయింది. నటన పట్ల ఆయనకి గల కొత్త కూడా కలిసొచ్చింది.
'గడీ' నేపథ్యంలో సాగే ప్రేమకథ కావడం వలన .. పాటలు బాగా కుదరడం వలన, ఆ సినిమా ఆయనకి మంచి గుర్తింపును తెచ్చింది. ఆ తరువాత ఆయన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమా చేశాడు. తన కాళ్లపై తాను నిలబడాలి .. తన ప్రత్యేకతను చాటుకోవాలని తపించే ఒక మధ్యతరగతి యువకుడి పాత్ర అది. ఈ సినిమాలో కూడా ఆయన పాత్రలో తెగింపు అనేది కనిపించదు. ఇక ఇప్పుడు ఆయన 'పుష్పక విమానం' సినిమాతో ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమాలో ఆయన ఇన్నోసెంట్ టీచర్ పాత్రలో కనిపించనున్నాడు. తన పెళ్లామ్ తనని వదిలేసి వెళ్లిపోయింది అనేది ఒక బేస్ లైన్ లా పట్టుకుని మరీ వస్తున్నాడు. అయితే కథ ఏదైనా .. కథనం ఎలా ఉన్నా ఆయన ఇన్నోసెంట్ పాత్రలనే వరుసగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇదే కంటిన్యూ అయితే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. అందువలన ఇకనైనా ఆయన తన రూట్ మార్చుకోవలసిన అవసరం కనిపిస్తోంది.