నెల్లూరు జిల్లాలో జలకన్య కలకలం... స్పందించిన ఆక్వా సహకార మార్కెట్ డైరెక్టర్
- జలకన్య వలకు చిక్కిందంటూ ప్రచారం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
- అన్నీ వదంతులేనన్న పామంజి నరసింహులు
- ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని సూచన
నెల్లూరు జిల్లాలోని మైపాడ్ బీచ్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుపొందింది. అయితే గత కొన్నిరోజులుగా ఓ కథనం విపరీతంగా ప్రచారం అవుతోంది. మైపాడ్ బీచ్ లో మత్స్యకారుల వలకు జలకన్య చిక్కుకుందంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలను బాగా షేర్ చేస్తుండడం, ఇది నిజమేనేమో అన్నంతగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
దీనిపై ఏపీ ఆక్వా సహకార మార్కెట్ డైరెక్టర్ పామంజి నరసింహులు స్పందించారు. ఇవన్నీ వట్టి పుకార్లేనని, వాటిని నమ్మవద్దని స్పష్టం చేశారు. అసలు ఈ వీడియోలు కూడా మన దేశానికి చెందినవి కావని అన్నారు. ఆయన ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఇలాంటి ఫేక్ ప్రచారాలను అడ్డుకోవాలని కోరారు.