ఈ కథ మిమ్మల్ని కదలనివ్వదు: కార్తికేయ
- రిలీజ్ కి రెడీ అవుతున్న 'రాజా విక్రమార్క'
- నా పాత్ర చాలా స్టైలీష్ గా ఉంటుంది
- ఇలాంటి జోనర్లో ఇంతకుముందు చేయలేదు
- చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయన్న కార్తికేయ
కార్తికేయ హీరోగా 'రాజా విక్రమార్క' సినిమా రూపొందింది. తాన్య రవిచంద్రన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, '88' రామారెడ్డి నిర్మించారు. యాక్షన్ కామెడీ జోనర్ కి చెందిన ఈ సినిమాకి, శ్రీ సరిపల్లి దర్శకుడిగా వ్యవహరించాడు. ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన థియేటర్లకు రానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ ల్లో కార్తికేయ మాట్లాడుతూ .. " యాక్షన్ కామెడీ జోనర్లో నేను ఇంతవరకూ చేయలేదు .. ఈ జోనర్లో నేను చేసిన ఫస్టు సినిమా ఇది. నా పాత్ర చాలా స్టైలీష్ గా ఉంటుంది. రెండున్నర గంటలపాటు ఈ కథ ప్రేక్షకులను కదలనివ్వదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఉత్కఠ ఉంటుంది .. అదే సమయంలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది.
ఈ సినిమాకి దర్శకుడు మాత్రమే కాదు .. కెమెరామేన్ .. ఎడిటర్ కూడా కొత్తవారే. అయినా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ఈ టైటిల్ పోస్టర్ ను చిరంజీవిగారికి పెడితే ఆయన 'గుడ్ లక్' అన్నారు. యూవీ క్రియేషన్స్ లో .. శ్రీదేవి మూవీస్ లో ఒక్కో సినిమా చేయనున్నాను. కొత్త డైరెక్టర్ తో మరో సినిమా చేయనున్నాను. ఇవన్నీ కూడా వేరు వేరు జోనర్లకు చెందినవే" అని చెప్పుకొచ్చాడు.