టీ20 వరల్డ్ కప్: నమీబియాపై టాస్ గెలిచిన టీమిండియా
- టీ20 వరల్డ్ కప్ లో చివరి లీగ్ మ్యాచ్
- నేటితో ముగియనున్న సూపర్-12 దశ
- గ్రూప్-2లో భారత్ వర్సెస్ నమీబియా
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ
టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 దశ నేటితో ముగియనుంది. చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా, నమీబియా తలపడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ గ్రూప్-2 పోరులో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. వరుణ్ చక్రవర్తి స్థానంలో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ తుది జట్టులోకి వచ్చాడు.
టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, టోర్నీలో టాస్ చాలా కీలకంగా మారిందని అన్నాడు. గత రెండు మ్యాచ్ లలో టాస్ గెలిచి సత్ఫలితాలు సాధించామని వెల్లడించాడు. టీమిండియాకు టీ20 ఫార్మాట్ లోనూ కెప్టెన్ గా వ్యవహరించడం గౌరవంగా భావిస్తున్నానని, తన వరకు అత్యుత్తమ సేవలు అందించానని తెలిపాడు. రోహిత్ శర్మకు ఎలాగూ నాయకత్వ అనుభవం ఉందని, ఈ పొట్టి క్రికెట్లోనూ భారత జట్టు బాధ్యతలు మెరుగైన వ్యక్తి చేతుల్లోనే ఉంటాయని భావిస్తున్నానని తెలిపాడు.
ఈ టోర్నీతో కోహ్లీ టీ20 ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడు. కోహ్లీ వ్యాఖ్యల నేపథ్యంలో, టీ20 ఫార్మాట్లో భారత జట్టు తదుపరి కెప్టెన్ రోహిత్ శర్మేనని అర్థమవుతోంది.