దళితుడ్ని సీఎం చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి: సీఎం కేసీఆర్

  • ప్రత్యేక తెలంగాణకు దళితుడ్ని తొలి సీఎం చేస్తానన్న కేసీఆర్
  • ఇప్పటికీ విమర్శిస్తున్న విపక్షాలు
  • నేటి మీడియా సమావేశంలో వివరణ ఇచ్చిన కేసీఆర్
ప్రత్యేక తెలంగాణ వస్తే దళితుడ్ని తొలి సీఎం చేస్తామని కేసీఆర్ ప్రకటించడం, దానిపై విపక్షనేతలు ఇప్పటికీ విమర్శిస్తుండడం తెలిసిందే. తాజా ప్రెస్ మీట్లో సీఎం కేసీఆర్ ఈ అంశంపై స్పందించారు. తాము దళితుడ్ని సీఎం చేస్తామని చెప్పడం, తదనంతర కాలంలో చేయలేకపోవడం వాస్తవమేనని అన్నారు. దళితుడ్ని సీఎం చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలిపారు. తామే దళితుడ్ని సీఎం చేయనివ్వలేదంటూ షబ్బీర్ అలీయే గతంలో చెప్పాడని, ఇప్పటికీ విపక్ష నేతలు ఈ అంశంపై మాట్లాడడం తగదని పేర్కొన్నారు.

దళితుడ్ని సీఎం చేయకపోవడాన్ని ప్రజలు కూడా ఆమోదించారని, ఆ తర్వాత ఎన్నికల్లో తమకు ఘనవిజయం అందించారని కేసీఆర్ వివరించారు. "ఆ తర్వాత అనేక స్థానిక ఎన్నికలకు వెళితే మీకు అడ్రస్ కూడా లేదు. మీరు రాష్ట్రంలో ఇక జిల్లా పరిషత్ అయినా గెలిచారా? ఇక్కడ పునాది లేనిది మీకు, మాకు కాదు" అంటూ బీజేపీ తెలంగాణ నాయకత్వంపై ధ్వజమెత్తారు.


More Telugu News