పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఏమాత్రం లేదు: ఏపీ మంత్రి బుగ్గన

  • కేంద్రానికి ఉన్న వెసులుబాటు రాష్ట్రాలకు ఉండదు
  • రాష్ట్రానికి ఉండే ఖర్చులు, కేంద్రానికి ఉండే ఖర్చులు వేర్వేరు
  • పెట్రో ఉత్పత్తులు, ఎక్సైజ్ ద్వారానే రాష్ట్రానికి ఆదాయం వస్తోంది
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. నిరంతరంగా పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. మరోవైపు పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని కొంతమేర తగ్గించింది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు కూడా సుంకాన్ని తగ్గించే ప్రయత్నం చేశాయి. మరోవైపు, సుంకాలను తగ్గించాలంటూ ఏపీ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరుగుతోంది.
 
ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ పెట్రో ధరలను తగ్గించే అవకాశం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. పెట్రో ధరలను తగ్గించేందుకు కేంద్రానికి ఉన్న వెసులుబాటు రాష్ట్రాలకు ఉండదని చెప్పారు. రాష్ట్రానికి ఉండే ఖర్చులు వేరని, కేంద్రానికి ఉండే ఖర్చులు వేరని అన్నారు. రాష్ట్రానికి పెట్రో ఉత్పత్తులు, ఎక్సైజ్ ద్వారానే ఆదాయం వస్తోందని చెప్పారు. ఈ క్రమంలో కేంద్రం తీసుకున్నంత సులభంగా రాష్ట్రం నిర్ణయం తీసుకోలేదని అన్నారు.


More Telugu News