పెట్రో ధరలపై ఏపీ, బెంగాల్ ప్రశాంత్ కిశోర్ సూచనలు అమలు చేస్తున్నాయి: లంకా దినకర్
- చమురుపై పన్నులు తగ్గించిన కేంద్రం, పలు రాష్ట్రాలు
- ఏపీలో తగ్గించని వైనం
- ప్రజలను మోసం చేస్తున్నారన్న లంకా దినకర్
- ఏపీలోనే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారని ఆరోపణ
కేంద్రంతో పాటు, పలు రాష్ట్రాలు పెట్రో ధరలపై పన్నులు తగ్గించగా, మరికొన్ని రాష్ట్రాలు తగ్గించకపోవడంపై బీజేపీ నేత లంకా దినకర్ స్పందించారు. ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నారని, ఏపీ, బెంగాల్ రాష్ట్రాలు మాత్రం ప్రశాంత్ కిశోర్ సూచనలు అమలు చేస్తున్నాయని అన్నారు.
తగ్గించాల్సిన అవసరం లేదని సీఎం జగన్ ప్రజాధనంతో పేపర్లో ప్రకటన ఇస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ చుట్టూ అప్పుల కోసం ప్రదక్షిణలు చేసే జగన్, ప్రజాధనాన్ని ఇలా దుబారా చేస్తారా? అని లంకా దినకర్ విమర్శించారు.
ప్రజలకు అర్థంకాకుండా పర్సంటేజీల పేరుతో మోసం చేశారని ఆరోపించారు. దేశంలో ఏపీలోనే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ మాయలు, మోసాలతో పాలన సాగిస్తున్నారని ఆయన వివరించారు.