జూనియర్ ఎన్టీఆర్తో ఓ బామ్మగారి అభిమానం.. ఫొటో వైరల్!
- ఈ బామ్మ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని
- ఎన్టీఆర్ను హత్తుకుని ఫొటో దిగిన బామ్మ
- ఎన్టీఆర్ను చూసి మురిసిపోయిన ఫ్యాన్
సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ నటనను చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు బాగా ఇష్టపడతారు. జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తుంటే సీనియర్ ఎన్టీఆర్ను చూసినట్లే ఉంటుందని కొందరు కామెంట్ కూడా చేస్తుంటారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్తో ఆయన అభిమాని అయిన ఓ బామ్మ దిగిన ఫొటో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ను చూసి ఆమె మురిసిపోయింది. ఆయనను హత్తుకుని ఫొటో దిగింది.
కాగా, ఇటీవల తన ఇంట్లో జిమ్లో వ్యాయామాలు చేస్తుండగా ఆయన కుడిచేతి వేలుకి గాయమైన విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ మైనర్ సర్జరీ చేయించుకున్నాడు. తాజాగా బామ్మతో దిగిన ఫొటోలలో కూడా జూనియర్ ఎన్టీఆర్ చేతికి కట్టు కనపడుతోంది. కొన్ని రోజుల పాటు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించడంతో ఆయన ప్రస్తుతం ఇంటి వద్దే గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' విడుదలకు సిద్ధమవుతోంది.