టీ20 ప్రపంచకప్ లో భారత్ ఓటమికి కారణం ఇదే: సునీల్ గవాస్కర్
- తొలి రెండు మ్యాచ్ లలో ఓడిపోవడానికి టాస్ కారణం కాదు
- పాక్, న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు
- ఆ రెండు మ్యాచ్ లలో పెద్ద స్కోర్లు సాధించినట్టయితే ఇండియా నాకౌట్ దశకు చేరుకునేది
టీ20 ప్రపంచకప్ లో టీమిండియా నాకౌట్ దశకు చేరుకోలేకపోయిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో జరిగిన తొలి రెండు మ్యాచ్ లలో ఓడిపోవడం... లీగ్ దశలోనే భారత్ నిలిచిపోవడానికి కారణమైంది. తొలి ఓటములపై భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ... టాస్ ఓడిపోవడం వల్లే టీమిండియా పరాజయం పాలయిందని చెప్పారు. అయితే భరత్ అరుణ్ అభిప్రాయంతో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఏకీభవించలేదు. టీమిండియా ఓటమికి టాస్ కారణం కాదని అన్నారు.
పాకిస్థాన్, న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో... మన బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారని గవాస్కర్ తెలిపారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మన బ్యాట్స్ మెన్ అద్భుతంగా పుంజుకుని 200కు పైగా పరుగులు చేశారని చెప్పారు. తొలి రెండు మ్యాచ్ లో కూడా భారత బ్యాట్స్ మెన్ పెద్ద స్కోర్లు సాధించి ఉంటే ఇండియా నాకౌట్ దశకు సులభంగా చేరుకునేదని అన్నారు. మరోవైపు 2012 టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా ఐసీసీ ఈవెంట్లో నాకౌట్ దశకు చేరుకోకపోవడం ఇదే తొలిసారి. ఇకపోతే, ఈరోజు నమీబియాతో భారత్ నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది.