ప్రపంచంలో అత్యంత ఆమోదయోగ్యమైన నేతల్లో మోదీ మరోసారి నెంబర్ వన్
- మార్నింగ్ కన్సల్ట్ సంస్థ తాజా రేటింగ్ సర్వే
- మోదీ నాయకత్వానికి 70 శాతం మంది ఆమోదం
- రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు
- గతంలోనూ మోదీకే పట్టం
ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన ఛరిష్మాను చాటుకున్నారు. ప్రపంచంలో అత్యంత ఆమోదయోగ్యమైన నేతగా మరోసారి నెంబర్ వన్ గా నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా 13 మంది ప్రపంచనేతల్లో మోదీనే అగ్రస్థానంలో నిలిచారు. ఈ రేటింగ్ సర్వేను మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సంస్థ నిర్వహించింది. మోదీ నాయకత్వానికి 70 శాతం మంది ఆమోదం తెలిపారు.
ఈ జాబితాలో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రడోర్ 66 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. ఇక ఇటలీ ప్రధాని మారియో ద్రాఘి (58%), ఏంజెలా మెర్కెల్ (54%), ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ (47%), అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (44%) తదితరులు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.