నేను ఈ సినిమాలో నటించానన్న కారణంతో వివాదం సృష్టిస్తున్నారు: ప్రకాశ్ రాజ్
- సూర్య ప్రధాన పాత్రలో 'జై భీమ్' చిత్రం
- పోలీసు అధికారిగా నటించిన ప్రకాశ్ రాజ్
- సినిమాలో హిందీ మాట్లాడే వ్యక్తిని చెంపదెబ్బ కొట్టే సీన్
- హిందీ భాష మాట్లాడేవారిని అవమానించారంటూ వివాదం
సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన 'జై భీమ్' చిత్రం కొన్నిరోజుల కింద విడుదలై ప్రజాదరణ అందుకుంటోంది. అయితే ఈ సినిమాలోని ఓ చెంపదెబ్బ సీన్ వివాదాస్పదం అయింది. ఇందులో హిందీ మాట్లాడుతున్న వ్యక్తిని పోలీసు అధికారి అయిన ప్రకాశ్ రాజ్ చెంపపై కొడతాడు. హిందీ భాష మాట్లాడేవారిని ఈ సన్నివేశం ద్వారా అవమానించారంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు.
'జై భీమ్' చిత్రం ఇతివృత్తాన్ని అర్థం చేసుకోకుండా, కేవలం ఓ చెంపదెబ్బ సన్నివేశాన్ని వివాదంగా మార్చుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. 'జై భీమ్' చిత్రంలో పీడితవర్గాల సమస్యలను, వాళ్ల కడగండ్లను చూపించామని, కానీ కొందరు అసలు విషయాన్ని వదిలేసి చెంపదెబ్బ సీన్ ను విమర్శించడం చూస్తుంటే వాళ్ల ఉద్దేశం ఏంటో అర్థమవుతోందని తెలిపారు.
ఈ సినిమాలో నేను నటించానన్న కారణంతోనే ఆ సీన్ ను వివాదాస్పదం చేస్తున్నారు అంటూ ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఇటువంటి వివాదాలపై స్పందించడం కూడా అనవసరం అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మలయాళ నటి లిజోమోల్ జోస్ కీలకపాత్ర పోషించారు.