'మూడో నంబ‌రు ఇంట్ల అమ్మాయి కీర్తి' అంటూ 'ఓసీఎఫ్ఎస్‌'లో సిమ్రన్ శ‌ర్మ లుక్ విడుద‌ల చేసిన టీమ్

  • మెగా డాటర్ నిహారిక నిర్మాత‌గా ఓసీఎఫ్ఎస్
  • 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్ ఈ నెల 19 నుంచి ప్రారంభం
  • మ‌న మ‌హేశ్ కి త‌నంటే ప్రీతి అంటూ సిమ్రన్ శ‌ర్మ లుక్ విడుద‌ల‌
మెగా డాటర్ నిహారిక  ఓసీఎఫ్ఎస్ (ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ) వెబ్ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తోన్న విష‌యం తెలిసిందే. 'మూడో నంబ‌రు ఇంట్ల అమ్మాయి కీర్తి ఎ.కె.ఎ.. మ‌న మ‌హేశ్ కి త‌నంటే ప్రీతి' అంటూ సిమ్రన్ శ‌ర్మ లుక్‌ను ఈ వెబ్‌సిరీస్ బృందం ఈ రోజు విడుద‌ల చేసింది.

                 
కాగా, ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ స్టోరీతో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్ సిరీస్ లో 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి. ఈ వెబ్ సిరీస్  జీ5 లో నవంబర్ 19న ప్రారంభం కానుంది. ఇందులో సంతోష్ శోభన్, సిమ్రన్ శర్మ హీరో, హీరోయిన్లుగా, సీనియర్ నటులు నరేశ్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు.


More Telugu News