అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల బయట రైతుల ఆందోళన

  • పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఘటన
  • సాగు చట్టాలకు వ్యతిరేకంగా  ఆందోళన చేస్తున్న తమకు అక్షయ్ మద్దతు ఇవ్వలేదని ఆందోళన
  • మద్దతు ఇచ్చేంత వరకు అడ్డుకుంటామన్న రైతులు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు నిన్న అక్షయ్ కుమార్ సినిమా ‘సూర్యవంశీ’ ప్రదర్శనను అడ్డుకున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తమకు అక్షయ్ కుమార్ మద్దతు ఇవ్వడం లేదని చెబుతూ పంజాబ్‌లోని హోషియా‌ర్‌పూర్‌లో ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల బయట ఆందోళనకు దిగి సినిమా పోస్టర్లను చించివేశారు. భారతి కిసాన్ యూనియన్ (కడియాన్) జిల్లా అధ్యక్షుడు స్వరణ్ దుగ్గా నేతృత్వంలోని రైతులు స్థానిక షహీద్ సింగ్ పార్కు నుంచి స్వరణ్ సినిమా వరకు మార్చ్ నిర్వహించారు.

సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని థియేటర్ యజమానులను డిమాండ్ చేశాడు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తమకు నటుడు అక్షయ్ కుమార్ మాటమాత్రమైనా మద్దతు తెలపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు సినిమాను ప్రదర్శించనివ్వబోమని  తేల్చి చెప్పారు. దీంతో థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


More Telugu News