మహా పాదయాత్ర నిర్వాహకులకు నోటీసులు ఇచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులు

  • అమరావతి కోసం రైతుల పాదయాత్ర
  • ప్రకాశం జిల్లాలో ప్రవేశించిన పాదయాత్ర
  • ఎక్కువ శబ్దం వచ్చే మైకులు వాడుతున్నారన్న పోలీసులు
  • ఎక్కువమంది పాల్గొంటున్నారని ఆరోపణ
అమరావతి ఒక్కటే రాజధాని అనే నినాదంతో ఉద్యమిస్తున్న రైతులు మహా పాదయాత్ర చేపట్డడం తెలిసిందే. కాగా, పాదయాత్ర నిర్వాహకులకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎక్కువ శబ్దం వచ్చే మైకులు వాడారని, కరోనా నేపథ్యంలో మాస్కులు లేకుండా యాత్రలో పాల్గొన్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువమంది పాదయాత్రలో పాల్గొంటున్నారని ఆరోపించారు.

కాగా, పోలీసుల నోటీసులపై మహా పాదయాత్ర నిర్వాహకులు స్పందించారు. వారంలోగా నోటీసులపై వివరణ ఇస్తామని వెల్లడించారు. నేడు పాదయాత్ర గుంటూరు జిల్లా పెదనందిపాడు నుంచి ప్రకాశం జిల్లా పర్చూరు చేరుకుంది. రేపు రాత్రికి రైతులు ఇంకొల్లు చేరుకుంటారు. సోమవారం పాదయాత్రకు విరామం అని నిర్వాహకులు ప్రకటించారు.


More Telugu News