అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ... తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేత
- ఈ నెల 14న సదరన్ జోనల్ సమావేశం
- తిరుపతి వేదికగా కీలక భేటీ
- హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల సీఎంలు
- శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం
తిరుపతిలో ఈ నెల 14న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ సీఎంలు పాల్గొననున్నారు. సదరన్ జోనల్ సమావేశం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి బ్రేక్ దర్శనాలు మూడ్రోజుల పాటు రద్దు చేసింది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేసింది. ఈ నెల 12, 13, 14 తేదీల్లో సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.