విపక్ష నేతగా ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేసిన జగన్ ఇప్పుడేం చెబుతారు?: చంద్రబాబు

  • భగ్గుమంటున్న చమురు ధరలు
  • ఇతర రాష్ట్రాల్లో తగ్గించారన్న చంద్రబాబు
  • ఏపీలోనూ తగ్గించాలని డిమాండ్
  • పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై పడుతుందని వెల్లడి
ఏపీలో పెట్రో ధరలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికం అని అన్నారు. అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గిస్తుంటే ఏపీలో ఎందుకు తగ్గించడంలేదంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేసిన జగన్ ప్రస్తుత పరిస్థితిపై ఏం సమాధానం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెట్రో ధరల పెంపును తీవ్రంగా పరిగణించాల్సిందేనని, పెట్రో ధరల పెంపు ప్రభావం అనేక రంగాలపై ఉంటుందని అన్నారు. ధరల పెంపు కారణంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, ప్రజలపైనా తీవ్ర భారం పడుతోందని చంద్రబాబు వివరించారు. అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని నాడు జగన్ చెప్పారని గుర్తు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News