అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను పోటీ చేసే అంశంపై యోగి ఆదిత్య‌నాథ్ స్పంద‌న‌

  • నేను పోటీ చేసే అంశంపై బీజేపీ నిర్ణ‌యం తీసుకుంటుంది
  • ఆ త‌ర్వాతే  ఎన్నిక‌ల బ‌రిలో దిగుతా
  • ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌న్నింటినీ  నెర‌వేర్చాం
మ‌రికొన్ని నెల‌ల్లో ఉత్త‌రప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశంపై రాజ‌కీయ పార్టీలు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో తాను పోటీ చేసే అంశంపై యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ స్పందించారు. తాను పోటీ చేసే అంశంపై బీజేపీ నిర్ణ‌యం తీసుకుంటుందని ఆయ‌న చెప్పుకొచ్చారు.

బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న త‌ర్వాతే ఎన్నిక‌ల బ‌రిలో దిగుతాన‌ని తెలిపారు. తాను ఈ ఎన్నిక‌ల్లో ఏ నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీ చేస్తాన‌నే విష‌యంపై కూడా అప్పుడే స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని చెప్పారు. త‌నతో పాటు పార్టీ నేత‌లు అంద‌రూ ఎక్క‌డి నుంచి పోటీ చేయాల‌న్న విష‌యం బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు నిర్ణ‌యిస్తుంద‌ని అన్నారు. గ‌త ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌న్నింటినీ బీజేపీ నెర‌వేర్చింద‌ని చెప్పారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడామ‌ని అన్నారు.


More Telugu News