8 గంటల కంటే ఎక్కువగా నిద్రపోతున్నారా? స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉందంటోన్న పరిశోధకులు
- అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్ లో ప్రచురణ
- 8 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోయే వారిలో స్ట్రోక్స్
- 62 ఏళ్ల వయసు ఉన్న 32,000 మందిపై అధ్యయనం
రోజుకు సరిపడా నిద్రపోకపోయినా, అతిగా నిద్రపోయినా ఆరోగ్యానికి ప్రమాదమే. రోజుకు దాదాపు 8 గంటల పాటు నిద్రపోవాలన్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోతే స్ట్రోక్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్ ప్రచురించిన ఓ నివేదిక స్పష్టం చేసింది.
6 నుంచి 8 గంటల మధ్య నిద్రపోయే వారితో పోల్చితే 8 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోయే వారిలో స్ట్రోక్స్ సమస్య ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెప్పారు. స్ట్రోక్‌కు గురై కార్డియాక్ అరెస్ట్ వల్ల మరణాలు నమోదవుతున్నాయని వివరించారు.
ఈ పరిశోధనలో భాగంగా సగటున 62 ఏళ్ల వయసు ఉన్న 32,000 మందిపై అధ్యయనం జరిపారు. మెదడులో రక్త ప్రసరణకు ఆటంకాలు ఏర్పడితే కణజాలాలు దెబ్బతిని, స్ట్రోక్ వస్తుంది. 8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారితో పోల్చి చూస్తే 9 గంటలు లేక అంతకంటే అధిక సమయం నిద్రపోయే వారికి స్ట్రోక్ ముప్పు 23 శాతం అధికమని పరిశోధకులు చెప్పారు.
అంతేకాదు, అతి తక్కువగా నిద్రపోతే వారిలోనూ స్ట్రోక్ ప్రమాదం 82 శాతం ఎక్కువని స్పష్టం చేశారు. 8 గంటల కంటే అధికంగా నిద్ర పోవడం వల్ల స్ట్రోక్ వస్తుందని పరిశోధకులు చెబుతున్నప్పటికీ స్ట్రోక్ వచ్చినవారిలో తరచుగా నిద్రలేమి సమస్యలూ తలెత్తుతాయని పరిశోధకులు తెలిపారు.
వారిలో జ్ఞాపక శక్తి తగ్గడం, ఉత్సాహంగా లేకపోవడం వంటి సమస్యలూ వస్తాయని వివరించారు. అధికంగా నిద్రపోయే వారిలో బరువు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే 80 శాతం వరకు స్ట్రోక్ వచ్చే ప్రమాదాలను తగ్గించవచ్చని చెప్పారు.