కొవాగ్జిన్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్.. టీకా తీసుకున్న వారికి దేశంలోకి ఎంట్రీ!

  • డబ్ల్యూహెచ్ఓ అనుమతి నేపథ్యంలో నిర్ణయం
  • కొత్త ప్రయాణ మార్గదర్శకాల విడుదల
  • 8వ తేదీ నుంచి అమల్లోకి
భారత స్వదేశీ కరోనా టీకా ‘కొవాగ్జిన్’కు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ టీకా తీసుకున్న వారిని దేశంలోకి అనుమతిస్తున్నట్టు తెలిపింది. టీకా తీసుకున్న విదేశీయుల కోసం తాజాగా కొత్త ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసిన అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) కొవాగ్జిన్‌ను జాబితాలో చేర్చింది. ఎల్లుండి (ఈ నెల 8వ తేదీ) నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల అత్యవసర వినియోగం నిమిత్తం కొవాగ్జిన్‌కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  


More Telugu News