ముఖేశ్ అంబానీ యూకేకు మకాం మార్చేస్తున్నట్టు వార్తలు.. ఖండించిన రిలయన్స్
- 300 ఎకరాల్లోని విశాలమైన భవనాన్ని కొనుగోలు చేసినట్టు వార్తలు
- ఇకపై అక్కడి నుంచే వ్యాపార కార్యకలాపాలు అంటూ వార్తలు
- ‘పూర్తిగా నిరాధారమైన వార్త’ అంటూ కొట్టిపడేసిన రిలయన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ లండన్‌లోని బకింగ్‌హామ్‌షైర్, స్టోక్‌పార్క్‌లో 300 ఎకరాల్లో 49 బెడ్రూములతో ఉన్న అత్యంత విశాలమైన భవనాన్ని కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అంబానీ కుటుంబ సభ్యులు దీపావళిని అక్కడే జరుపుకుంటున్నారని కూడా పుకార్లు షికారు చేశాయి.
ముంబైలోని తమ ‘అంటిల్లా’ భవనంలో ఉన్నట్టుగానే అందులోనూ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని, అక్కడ కూడా ఓ మందిరం నిర్మిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్పుకొచ్చాయి. ముఖేశ్ త్వరలో ఇకపై అక్కడి నుంచే తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తారని కూడా ఆ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే, ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ కొట్టిపడేసింది. అంబానీ యూకేను తన రెండో ఇంటిగా చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలు వాస్తవ దూరమని పేర్కొంది. అంబానీ కుటుంబం ముంబైలోనే ఉంటుందని స్పష్టం చేసింది.