ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను?: సాయిధరమ్ తేజ్

  • గత సెప్టెంబరులో రోడ్డు ప్రమాదం
  • ఆసుపత్రిలో సాయిధరమ్ తేజ్ కు సర్జరీ
  • పూర్తిగా కోలుకున్నాడంటూ చిరంజీవి వెల్లడి
  • పూర్వజన్మ సుకృతమన్న సాయిధరమ్ తేజ్
టాలీవుడ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు. గత సెప్టెంబరు 10న బైక్ పై ప్రయాణిస్తూ హైదరాబాదులో రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత సాయిధరమ్ తేజ్ ఇన్నాళ్లకు తొలిసారిగా దర్శనమిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు సాయి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోను చిరంజీవి పంచుకోవడం తెలిసిందే. దీనిపై సాయిధరమ్ తేజ్ స్పందించారు.

తనకు ఇది పునర్జన్మ వంటిదని పేర్కొన్నారు. నా పునర్జన్మకు కారణమైన మీ ప్రేమకు, మీ ప్రార్థనలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? అంటూ భావోద్వేగాలతో పోస్టు చేశారు. మీ ప్రేమను పొందడం నా పూర్వజన్మ సుకృతం అంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.





More Telugu News