దీపావ‌ళి బాణసంచా ప్ర‌భావం.. ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

  • నిషేధంలో కూడా బాణ‌సంచా కాల్చిన‌ ప్రజ‌లు
  • ప‌డిపోయిన‌ గాలి నాణ్యత
  • 301-400 మధ్య  చేరిన వైనం  
ఢిల్లీలో వాయు కాలుష్యం మ‌ళ్లీ పెరిగిపోయింది. దీపావళి పండుగ నేప‌థ్యంలో బాణసంచాపై ఢిల్లీ నిషేధం విధించినప్ప‌టికీ ప్రజలు ఆ నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా కాల్చారు. దీంతో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లో ప్ర‌మాద‌క‌ర స్థాయికి వాయు కాలుష్యం చేరింది. ఢిల్లీ యూనివర్సిటీ, పీయూఎస్‌ఏ, లోధి, మధుర రోడ్‌లు, ఐఐటీ ఢిల్లీ, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతాల్లో గాలి నాణ్యత 396, 376, 379, 398, 395, 387గా ఉంద‌ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.

గాలి నాణ్యత రెండు రోజుల్లో తిరిగి సాధారణ స్థాయికి రావచ్చని అధికారులు భావిస్తున్నారు. గాలి నాణ్య‌త 0 నుంచి 5 మధ్య నమోదైతే మంచి స్థాయిలో ఉన్నట్టు ప‌రిగ‌ణిస్తారు. 201-300 మధ్య గాలి నాణ్యత ఉంటే వాయు కాలుష్యం ఉంద‌ని భావిస్తారు. 301-400 మధ్య ఉంటే బాగా ఉన్న‌ట్లు ప‌రిగ‌ణిస్తారు. అంత‌కు మించితే ప్రమాదకర స్థాయిలో ఉన్న‌ట్లు.


More Telugu News