కేదార్‌నాథ్‌లో ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- ఆదిశంకరాచార్య సమాధిని పునఃప్రారంభించనున్న ప్రధాని
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
- దేశ వ్యాప్తంగా సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమాలు
ప్రధాని మోదీ ఈ రోజు కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం జగద్గురు ఆదిశంకరాచార్య సమాధిని ప్రధాని పునఃప్రారంభించనున్నారు. 2013 వరదల కారణంగా అప్పట్లో సమాధి దెబ్బతింది. కాసేపట్లో ఆయన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
ఆ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. సరస్వతి ఘాట్ తో పాటు 130 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇన్ ఫ్రా ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. మరోవైపు, మోదీ కేదార్‌నాథ్ పర్యటన నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు దేశ వ్యాప్తంగా సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమాలు నిర్వహించాలని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్పారు.