పశ్చిమ బెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత.. తీరని లోటన్న మమతా బెనర్జీ
- గుండెపోటుతో గత నెలలో ఆసుపత్రిలో చేరిన సుబ్రతా ముఖర్జీ
- పరిస్థితి విషమించడంతో నిన్న మృతి
- వ్యక్తిగతంతా ఇది తనకు తీరని నష్టమన్న మమతా బెనర్జీ
తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ పంచాయతీ మంత్రి సుబ్రతా ముఖర్జీ గుండెపోటుతో హఠాన్మరం చెందారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గత నెలలో తీవ్ర గుండెపోటుకు గురైన మంత్రి ప్రభుత్వ ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాట్లాడుతూ.. సుబ్రత మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు. జీవితంలో తాను చాలా విషాదాలు చూశానని, కానీ సుబ్రతా ముఖర్జీ మృతి లోటు మాత్రం పూడ్చలేనిదన్నారు. నిజానికి ఆయన రేపు డిశ్చార్జ్ అవుతారని చెప్పారని, అంతలోనే ఆయన మరణవార్త వినాల్సి వస్తుందనుకోలేదన్నారు.
కాగా, కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్‌కు సుబ్రతా ముఖర్జీ తొలి మేయర్‌గా పనిచేశారు. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన కాంగ్రెస్‌లో చాలాకాలం పనిచేశారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.