హైదరాబాద్‌లో భారీ పేలుడు.. ఇద్దరి దుర్మరణం

  • ఛత్రినాక పరిధిలోని కందికల్ గేట్ సమీపంలో ఘటన
  • విగ్రహ తయారీ పరిశ్రమలో బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు
  • మృతులను పశ్చిమ బెంగాల్ వాసులుగా గుర్తించిన పోలీసులు
హైదరాబాద్‌లో గతరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని ఛత్రినాక పరిధిలోని కందికల్ గేట్ సమీపంలోని పీవోపీ విగ్రహ తయారీ పరిశ్రమలో ఈ ఘటన జరిగింది. బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించినట్టు పోలీసులు తెలిపారు.

చనిపోయిన వారిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన విష్ణు (25), జగన్నాథ్ (30)గా గుర్తించారు. బాణసంచాకు రసాయనాలు కలవడంతో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News