టాస్ గెలిచి బ్యాటింగ్ ఇస్తే చితకబాదారు!... వెస్టిండీస్ పై శ్రీలంక భారీ స్కోరు
- అబుదాబిలో వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
- బెడిసికొట్టిన నిర్ణయం
- విరుచుకుపడిన లంక టాపార్డర్
టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ కు ఆ నిర్ణయం బెడిసికొట్టింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక... వెస్టిండీస్ నిర్ణయాన్ని అపహాస్యం చేస్తూ భారీ స్కోరు నమోదు చేసింది. టాపార్డర్ వీరవిహారం చేసిన ఈ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు సాధించింది.
అసలంక 41 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 68 పరుగులు చేయగా.... ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 41 బంతుల్లో 5 ఫోర్లతో 51 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ కుశాల్ పెరెరా 29, కెప్టెన్ దసున్ షనక 14 బంతుల్లో 25 పరుగులు నమోదు చేశారు.
ఇక లక్ష్యఛేదనలో వెస్టిండీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ జట్టు 10 పరుగులకే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. లంక బౌలర్ బినుర ఫెర్నాండో అద్భుతమైన స్పెల్ తో క్రిస్ గేల్ (1), ఎవిన్ లూయిస్ (8)లను పెవిలియన్ కు తిప్పిపంపాడు.
ప్రస్తుతం వెస్టిండీస్ స్కోరు 5 ఓవర్లలో 2 వికెట్లకు 43 పరుగులు. నికోలాస్ పూరన్ 28, రోస్టన్ చేజ్ 5 పరుగులతో ఆడుతున్నారు.